ఆ అబద్ధమే నిజమైంది!

ఆ అబద్ధమే నిజమైంది!

నేను పుట్టింది కేరళలోని కొట్టాయంలో. మా పేరెంట్స్ జాబ్స్ వల్ల టాన్స్​ఫర్స్ ఎక్కువ అవుతుండేవి. దాంతో నేను ఎక్కువగా చెన్నయ్, బెంగళూరులో పెరిగా. పీహెచ్​డీ చేయాలనే ఆశతో యూకే వెళ్లా. 2013లో చదువు మీద విసుగొచ్చింది. ఒకరోజు మా ఫ్రెండ్స్​తో ‘యాక్టర్​ అవుతా’ అని అబద్ధం చెప్పా, దాన్ని ఫేస్​బుక్​లో కూడా పోస్ట్​ చేశా. కొన్నేండ్ల తర్వాత అది ఫేస్​బుక్​ మెమరీ నోటిఫికేషన్​లో వచ్చింది. అది చూసి నిజంగానే యాక్టర్​ అయ్యా అని ఒక్క క్షణం ఆశ్చర్యం.. ఆ తరువాత సంతోషం కలిగాయి. ఇప్పుడిక నటనలోనే కొనసాగుతున్నా. నేను నటించిన రెండో సినిమా ‘జల్లికట్టు’ ఆస్కార్ వరకు వెళ్లిందని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అంతేకాదు నేను నటించిన ప్రతి సినిమా నాకు స్పెషల్​. అలాంటి కథల్లో నేను భాగం కావడం, అందులో నా క్యారెక్టర్​ ఢిఫరెంట్​గా ఉండడం నాకు చాలా నచ్చింది.

విరామం కోసం వెళ్లి.. 

యూకేలో ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలో పీహెచ్​డీ (2016) కంప్లీట్ చేశా.  ఆ తర్వాత కాస్త బ్రేక్​ తీసుకుని పీహెచ్​డీ థీసిస్​ రాయడం మొదలుపెట్టా. అది రాసేటప్పుడు బెంగళూరులోనే ఉన్నా. థీసిస్​ అక్కడే పూర్తి చేశా. రెండు మూడు నెలలు అక్కడే ఉంటానని నాకు ముందే తెలుసు. కాబట్టి ఆ టైంలో మనసుకు నచ్చిన పని ఏదైనా చేయాలనుకున్నా. అలా ‘ది లవర్’ అనే నాటకంలో లీడ్​ రోల్​లో నటించా. ఆ నాటకం ప్రి– ప్రొడక్షన్ జరిగేటప్పుడు మా డైరెక్టర్ అరుణ్​ డొమ్నిక్ ‘‘వేరే సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ‘మాలిని’ అనే పాత్ర కోసం మంచి యాక్టర్స్​ కోసం వెతుకుతున్నారు. వాళ్లకి నీ నెంబర్​ ఇచ్చా’’ అని చెప్పాడు. అయితే వాళ్ల దగ్గర ఉన్నది నా యూకే ఫోన్​ నెంబర్. నేను బెంగళూరులో ఉన్నా కాబట్టి, అప్పుడు ఇండియన్ నెంబర్​నే వాడుతున్నా. ఆ విషయం వాళ్లకు తెలియక ఆ నెంబర్​కే మెసేజ్ చేశారు. ఒక వారం తర్వాత, వైఫైకి యూకే నెంబర్ కనెక్ట్​ కావడం వల్ల నాకు మెసేజ్​ కనిపించింది. ‘మాలిని పాత్ర కోసం ఆడిషన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్​ ఉంటే పార్టిసిపేట్ చేయండి’ అని మెసేజ్​ సారాంశం. ‘సరే చేస్తా’ అన్నా. వాళ్లు నాకు స్క్రిప్ట్​ పంపారు. అందులో మొదటి సీన్​ చేయాలన్నారు. అది చేసి పంపా. దాంతో వాళ్లు అసలైన ఆడిషన్​కి రమ్మన్నారు. అలా నాకు అందులో అవకాశం వచ్చింది. అలా నా మొదటి సినిమా ‘తరంగం’ (2017)తో నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత ‘జల్లికట్టు’(2019), ‘పాపమ్ చెయ్యతవార్ కల్లేరియట్టే’ (2020) వంటి సినిమాల్లో వరుసగా నటించా. ఈ మూడు సినిమాల వల్ల నాకు గుర్తింపు  వచ్చింది. 

వాటిలో నటించడం బాగుంటుంది

చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడే నాటకంలో నటించా. ఆ తర్వాత యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మరొక నాటకంలో చేశా. అప్పుడు నేను యాక్టింగ్​ని కెరీర్​గా తీసుకోవాలనే ఉద్దేశంతో నటించలేదు. చదువు మీదే దృష్టి ఉండేది. ఆక్స్​ఫర్డ్​లో చదివేటప్పుడు చదువుతోపాటు ర్యాండమ్​గా నచ్చిన వాటిలో వర్క్​షాప్​ చేయమని చెప్పేవాళ్లు. అలా నటనని ఎప్పుడూ వదల్లేదు. అయితే నాటకం, సినిమాల మధ్య కొంచెం తేడా ఉంటుంది. టెక్నికల్​గా ఆ తేడా కొన్నింట్లో కనిపిస్తుంది. కానీ, ఓవరాల్​గా చూస్తే అంతా నటనే. ఈ రెండింటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. సినిమాల్లో నటించేటప్పుడు డైరెక్టర్​ చెప్పేవన్నీ శ్రద్ధగా విని, వాటిని ఫాలో అవ్వాలి. నాటకంలో అయితే రీటేక్​లు ఉండవు. కాబట్టి ఒకేసారి పర్ఫెక్ట్​గా చేయగలగాలి.

నా చదువు నేర్పింది

నేను ఆంత్రోపాలజీ చదివా. అందులో కల్చర్స్​ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఉంటుంది. ట్రెడిషన్స్, కల్చరల్​ లాజిక్స్ వంటివి ఉంటాయి. అవి వేరే కల్చర్​ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే ఆంత్రోపాలజీ అనేది క్రమశిక్షణ నేర్పిస్తుందంటా. ఇంకా ఇందులో చాలా విషయాలున్నాయి. అవన్నీ మంచి వ్యక్తిత్వాన్ని, సహనాన్ని, ఇతరుల పట్ల గౌరవాన్ని నేర్పిస్తాయి. నటనకు ఇవన్నీ చాలా అవసరం కూడా. సిచ్యుయేషన్స్​ని అర్థం చేసుకోవడాన్ని నా చదువే నాకు నేర్పించింది.

అమేజింగ్​ ఎక్స్​పీరియెన్స్

‘గుల్మొహర్’ సినిమాటోగ్రాఫర్ ఈషిత్ నారాయణ్​తో కలిసి అంతకు ముందు ఒక మ్యూజిక్ వీడియోకి పనిచేశా. ఆ పరిచయంతో ఆయన నా గురించి గుల్మొహర్​ టీంకి చెప్పాడు. ఆ తర్వాత ఆడిషన్​ కోసం ఫోన్​ కాల్ వచ్చింది. ఇది కొవిడ్ టైంలో ప్లాన్ చేయడంతో... కేరళలోనే సీన్స్ నటించి, వీడియో తీసి పంపాల్సి వచ్చింది. లక్కీగా నాకు అందులో అవకాశం రావడం, అంత పెద్ద యాక్టర్స్​తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అందులో కొన్నేళ్లుగా బాత్రా కుటుంబంతో ఉంటున్న రేష్మా సయీద్ పాత్రలో నటించా. సినిమాలో రేష్మ పాత్రను సున్నితంగా, గౌరవంగా ట్రీట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్​ డిజైనింగ్ వెనుక చాలా చర్చలు జరిగాయి. నేను మనోజ్​ బాజ్​పాయి, సిమ్రన్, షర్మిలా ఠాగోర్​ వంటి పెద్ద నటులతో నటించాలన్నప్పుడు ఎగ్జైటింగ్​ ఫీలయ్యా. వాళ్లతో పాటే ఉంటూ వాళ్ల నటన దగ్గరగా చూడటం అనేది గొప్ప అవకాశం. మా నాన్న ఒకసారి సరదాగా ‘నువ్వు మనోజ్​ బాజ్​పాయిలాంటి యాక్టర్స్​తో కలిసి నటిస్తావ్​ అన్నారు.’ అది నిజంగానే జరగడం నా అదృష్టం. 

ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా. డైరెక్టర్ రాహుల్ నటీనటులందరికీ ఇంట్లో ఉన్న ఫీలింగ్​ కలగాలని మేమంతా కలిసి టైం స్పెండ్ చేసేలా చేశాడు. అందరం ఒకే హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాం. దాంతో మా మధ్య మంచి రిలేషన్​ ఏర్పడింది. ఆ అనుబంధం సినిమాలో కూడా కనిపిస్తుంది. అలాగే ఇది ఉమ్మడి కుటుంబ కథ కావడంతో ప్రతి సీన్​లో పది మందికి పైనే ఆర్టిస్ట్​లు ఉండేవాళ్లు. అది పెద్ద ఛాలెంజ్​లా అనిపించేది. మొత్తం షెడ్యూల్ దాదాపు 36 రోజులు ఉంది. కాబట్టి తక్కువ టైంలోనే చాలా చేయాల్సి వచ్చింది. ఒక సీన్​లో నేను ఒక్కొక్కరికి నీళ్ళు పోస్తున్నప్పుడు కెమెరా నన్ను ఫాలో అవుతూ ఒక పాత్ర నుండి మరో పాత్రకు కదులుతుంది. అది చాలా రిహార్సల్స్ తర్వాత జరిగింది. మేము చేసిన యాక్టింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి. ‘గుల్మొహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ డైరెక్టర్, ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఒక్కో పాత్రను తీర్చిదిద్దిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. 

నా పాత్రల్లో అవే ఎక్కువ 

నాకు వచ్చే ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొన్నే. వాటిలోనే నేను ఎంచుకుంటా. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టం. చెప్పాలంటే నా పాత్రల్లో చాలా వరకు గ్రే షేడ్స్ లేదా లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఉదాహరణకు.. ‘తరంగం’లో క్లిప్టోమేనియా ఉన్న మాలిని, ‘జల్లికట్టు’'లో సోఫీ, ‘పాపం చేయతవర్ కల్లెరియట్టే’లో లిండా కూడా సైకలాజికల్ డిజార్డర్​ ఉన్న పర్సన్. అయితే ‘గుల్మొహర్’​లోని రేష్మ రోల్​ మాత్రం అందుకు భిన్నం. రేష్మ ఒక చురుకైన అమ్మాయి. ఇతరులతో చాలా నమ్మకంగా ఉంటుంది.

స్క్రిప్ట్​ రైటర్​గా..

నేను చిన్నప్పటి నుంచి క్రియేటివ్​గా ఉండేదాన్ని. రాయడం నాకు చాలా ఇష్టం. నటనతోపాటు అప్పుడప్పుడు వేరే ఏవైనా చేయాలి అనుకుంటా. ఇప్పుడైతే టైం కుదిరినప్పుడల్లా స్ర్కిప్ట్స్​ రాస్తున్నా. ‘తరంగం’ డైరెక్టర్​ అరుణ్​ డొమ్నిక్ చేసిన ‘ఓబ్లివియన్’ అనే మ్యూజిక్​ వీడియోకి స్క్రిప్ట్​ రాశా. ఒక ఫీచర్​ ఫిల్మ్​ స్క్రిప్ట్​ చేయడంలో మా ఫ్రెండ్​తో కలిసి పనిచేస్తున్నా. అంతేకాకుండా ఆర్ట్​ కూడా వేస్తా. ఇప్పటికే వేర్వేరు సిటీల్లో ఆరుసార్లు సోలో ఎగ్జిబిషన్స్ పెట్టా. గ్రూప్​ ఎగ్జిబిషన్స్​లో కూడా పార్టిసిపేట్ చేశా.’’  

యాక్టింగ్​ అంటే ప్యాషన్​తో సినీరంగంలోకి వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ, చదువు మీద ఇంట్రెస్ట్​తో పీహెచ్​డీ చేసి... ‘మధ్యలో బ్రేక్​ తీసుకుంటే బాగుంటుంది’ అని నటించాలనుకుందట.ఇలా అనుకున్న ఆ అమ్మాయి ‘స్వీట్​ కారం కాఫీ’ వెబ్​సిరీస్​లో నటించిన శాంతి బాలచంద్రన్. మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్​గా ‘స్వీట్​ కారం కాఫీ’తో తమిళంలో అడుగుపెట్టింది. ఇంతకుముందు ఆమె నటించిన ‘జల్లికట్టు’, ‘డిజిన్’లకు లాగానే ఈ సిరీస్​ కూడా డబ్​ అయ్యి తెలుగు ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. శాంతి సినీ జర్నీ ఆమె మాటల్లోనే...

తమిళంలో మొదటిసారి 

‘స్వీట్ కారం కాఫీ’ వెబ్​ సిరీస్​లో నటించా. ఇది తమిళంలో మొదటి ప్రాజెక్ట్​. ఇందులో సీనియర్ నటీమణులు లక్ష్మి, మధుబాలతోపాటు నాది కూడా ఒక మెయిన్​ రోల్. మూడు వేర్వేరు తరాలకు చెందిన కుటుంబంలోని ముగ్గురు మహిళల కథ. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. 
::: ప్రజ్ఞ