నిన్నటి దాకా అమ్మాయిల క్రికెట్ అంటే అభిమానుల్లో.. సగటు ప్రేక్షకుడిలో చిన్నపాటి నిర్లక్ష్య ధోరణి ఉండినట్లు కనిపించేది. విమెన్స్ క్రికెట్టా.. హా చూద్దాంలే.. హా ఏముందిలే.. ఏదో అడుతున్నారుగా.. హే అమ్మాయిల మ్యాచ్ ఏం చూస్తాం.. అన్నట్లుగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు మారిపోయింది. మేమేం తక్కువ కాదు.. అని ప్రూవ్ చేసుకున్నారు. సెమీస్ లో మెన్స్ కూడా ఛేజ్ చేయని స్కోర్ ను బీట్ చేసి.. ఫైనల్ లో స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన సౌతాఫ్రికాను మట్టికరిపించి విశ్వవిజేతలుగా నిలిచారు.
ఈ గెలుపుతో విమెన్స్ ఫేట్ మొత్తంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరి నోట విన్నా హర్మన్, స్మృతి, జెమీమా, షెఫాలీ, దీప్తి శర్మ.. ఇలా అందరి పేర్లు మెదులుతున్నాయి. అంతేకాదు వారి సోషల్ మీడియా పేజీలు డబుల్, త్రిబుల్ ఫాలోవర్లతో జూమ్ అయిపోయాయి. ఈ గెలుపు వారిని అభిమానులకు చేరువ చేయడమే కాదు.. అమ్మాయిల బ్రాండ్ వ్యాల్యూని పూర్తిగా పెంచేసింది. విమెన్స్ వరల్డ్ కప్ గెలుపు.. అమ్మాయిలకు కోట్లు కురిపిస్తోంది.
పోటీ పడుతున్న కంపెనీలు:
వరల్డ్ కప్ గెలుపుతో విమెన్ ప్లేయర్ల బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిపోయింది. కనీసం 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగిపోయింది. కంపెనీలు వాళ్ల బ్రాండ్ ఎండోర్స్ మెంట్ ఎంత అనే ఇంక్వైరీలు మొదలెట్టాయట. కొన్ని కంపెనీలు వాళ్ల బ్రాండ్ పార్ట్నర్షిప్ కొనసాగించేందుకు ఒప్పందం కోసం పోటీ పడుతుంటే.. మరికొన్ని కొత్త కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఇంక్వైరీలు మొదలుపెట్టినట్లు బేస్ లైన్ వెంచర్స్ ఎండీ తుహిన్ మిశ్రా తెలిపారు.
ఎంత తీసుకుంటున్నారంటే..
జెమీమా:
సెమీస్ లో ఆస్ట్రేలియాపై 127 రన్స్ తో టీమ్ కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా బ్రాండ్ వ్యాల్యూ డబుల్ అయినట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అంటే 100 శాతం ప్రమోషన్స్ ఫీజు పెరిగిపోయినట్లు జెమీమా ప్రమోషన్స్ మేనేజ్ చేస్తున్న JSW స్పోర్ట్స్ ఎండీ కిరణ్ యాదవ్ పేర్కొన్నారు. 10 నుంచి 12 కేటగిరీల కింద బ్రాండ్స్ ను డివైడ్ చేసుకుని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో ఇంతకుముందే చేసుకున్న బ్రాండ్ ప్రమోషన్ ఒప్పందాల కొనసాగింపు కోసం జెమీ రూ.75 లక్షల నుంచి కోటిన్నర రూపాయల వరకు తీసుకుంటుందట.
స్మృతి మంధాన:
ప్రమోషన్స్ కోసం ఇండియాలోనే అత్యధికంగా తీసుకుంటున్న మహిళా ప్లేయర్ స్మృతి మంధాన. ఇప్పటికే 16 బ్రాండ్స్ కు ప్రమోట్ చేస్తోంది. అందులో HUL, రెక్సోనా, నైకీ, హ్యుందాయి,హెర్బల్ లైఫ్, SBI, గల్ఫ్ ఆయిల్ మొదలైన బ్రాండ్స్ కు ప్రమోట్ చేస్తోంది స్మృతి. ఒక్క బ్రాండ్ కు ఒకటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఫీ తీసుకుంటుంది.
వరల్డ్ కప్ ఫైనల్ గెలుపుతో ఈ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోటర్స్ పేరుతో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆసక్తిగా మారింది. HUL స్మృతి ఫోటోను హైలైట్ చేస్తూ ట్వీట్ చేసింది. మరోవైపు జెమీమా ఫోటోతో రెక్సోనా బ్రాండ్ కు సంబంధించి ట్వీట్ చేసింది.
హర్మన్ ప్రీత్ కౌర్:
ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రమోట్ చేస్తున్న పుమా కంపెనీ.. హర్మన్ ఫోటోపై పుమా లోగోతో.. హర్మన్ వరల్డ్ విన్నింగ్ ఛాంపియన్ అని ట్వీట్ చేసింది. ఇలా కంపెనీలు ప్లేయర్లతో ఉన్న కాంట్రాక్ట్ కొనసాగించేందుకు.. వారిని తమ బ్రాండ్ పార్ట్ నర్స్ గా చూపించే క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. అయితే పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ ప్రకారం కాంట్రాక్ట్ కొనసాగించడం లేదా.. కొత్త కాంట్రాక్ట్ తీసుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
