షార్క్​ ట్యాంక్ రెండో సీజన్..!

షార్క్​ ట్యాంక్ రెండో సీజన్..!

ఈమధ్య వచ్చిన టీవీ సిరీస్​ల్లో షార్క్​ ట్యాంక్ ఇండియా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దాంతో ఈ షో రెండో సీజన్​ని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దానికి సంబంధించిన ప్రోమోని సోనీ టీవీ ట్విట్టర్​లో పెట్టింది. అందులో ఒక ఉద్యోగి తన వెంచర్​కు ఇన్వెస్టర్లు కావాలని బాస్​ని అడుగుతుంటాడు. బాస్ అతడి మాటల్ని పట్టించుకోడు. అప్పుడు బ్యాక్​గ్రౌండ్​లో ‘ఇన్వెస్టర్ల కోసం వాళ్లని వీళ్లని ఎందుకు అడగడం. షార్క్​ ట్యాంక్ ఇండియా రెండో సీజన్ వచ్చేస్తుంది’ అని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ప్రోమోలో ‘షార్క్స్​’ అష్నీర్ గ్రోవర్, అనుపమ్ మిట్టల్​, అమన్​ గుప్తా, వినీతా సింగ్, నమితా థాపర్​లు ఈ షోలో దాదాపు 42 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం  చూపించారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయాలం టే సోని లైవ్ యాప్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.