సోనియా, రాహుల్తో షర్మిల భేటీ

సోనియా, రాహుల్తో షర్మిల భేటీ

తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహానికి రావాలని లోక్ సభ ప్రతిపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆహ్వానించారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో భర్త అనిల్ తో కలిసి వెడ్డింగ్​కార్డ్ అందజేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ)  చైర్ పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై పలు అంశాలను సోనియా గాంధీకి వివరించారు.

ఈ సమావేశంలో భాగంగా  సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తకాన్ని షర్మిలకు అందజేశారు.  కాగా... సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని అందుకున్న తొలి వ్యక్తి తానే కావడం గర్వంగా ఉందని ‘ఎక్స్’ వేదికగా షర్మిల తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘షర్మి’ అని ప్రేమగా సంబోధిస్తూ సోనియా గాంధీ తన ఆత్మకథ పుస్తకాన్ని బహుమతిగా అందజేశారని వెల్లడించారు.- న్యూఢిల్లీ, వెలుగు