28 నుంచి షర్మిల పాదయాత్ర

28 నుంచి షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్​లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్​చార్జ్​లు, అనుబంధ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో పాదయాత్రపై చర్చించారు. షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్లను దేవేందర్ ఖండించారు. పంచె కట్టినంత మాత్రాన నిరంజన్ రెడ్డి రైతు కాదని ఎద్దేవా చేశారు. త్యాగాల కుటుంబం వైఎస్సార్​ది అయితే, బోగాల కుటుంబం కేసీఆర్‌‌ది అని ఆరోపించారు. వైఎస్సార్‌‌ అన్న మాటలు టీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని, కేసీఆర్ కుటుంబం నుంచి వీసా తీసుకొని రావాలా అని వైఎస్ అన్నారని గుర్తుచేశారు.