హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని రచయిత గద్దర్పేర్కొన్నారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వంపై షర్మిల పోరాడుతోందని అన్నారు. అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల ఆత్మరక్షణ కోసం పోలీసులతో అలా ప్రవర్తించారని తెలిపారు. తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం..
"ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేయాలి. ఎన్నికల యుద్ధానికి ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. డబ్బుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యమమప్పడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పడు ఉన్నాయి. మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి. యువత రాజకీయ శక్తిగా మారితేనే మార్పు సాధ్యమవుతుంది. షర్మిల అలా మారినందుకే ఆమె పోరాటాలను అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప కష్టాలు తీరలేవు. కేసీఆర్‌కి ఇవే చివరి ఎన్నికలు.
ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సచివాలయం, అసెంబ్లీని విద్యార్థులు చుట్టు ముట్టాలి." అని గద్దర్ పిలుపునిచ్చారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో షర్మిల, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. "సర్కార్ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట" అనే నినాదంతో ఈ దీక్ష చేపట్టారు.