కరోనాను ఖతం చేసే షార్ప్​ నేచురైజర్‌

కరోనాను ఖతం చేసే షార్ప్​ నేచురైజర్‌

హైదరాబాద్, వెలుగు: షార్ప్‌‌‌‌ కార్పొరేషన్‌‌ (జపాన్‌‌)కు చెందిన షార్ప్‌‌ బిజినెస్‌‌ సిస్టమ్స్‌‌ (ఇండియా) ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌  ఉప్పు ఆధారిత శానిటైజర్‌‌ సొల్యూషన్​ ‘నేచురైజర్’​ను లాంచ్​ చేసింది. ఇది కొవిడ్‌‌ డెల్టా వేరియంట్‌‌పై ఎఫెక్ట్​గా పనిచేస్తుందని, వైరస్‌‌ కౌంట్​ను 99 శాతం తొలగిస్తుందని కంపెనీ ప్రకటించింది.  ఈ శానిటైజర్‌‌ సొల్యూషన్​తో ఐఐఎస్‌‌సీలోని  సెంటర్‌‌ ఫర్‌‌ ఇన్‌‌ఫెక్షియస్‌‌ డిసీజ్​  బయోసేఫ్టీ ల్యాబ్​లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి.

తాగు నీరు, టేబుల్‌‌ సాల్ట్‌‌ ఉపయోగించి ఈ నేచురైజర్​..సోడియం హైపోక్లోరైట్‌‌ ద్రావణం తయారుచేస్తుంది. ఇది నేచురల్​ డిస్‌‌ఇన్‌‌ఫెక్టెంటెంట్​గా​ పనిచేస్తుంది.  బ్యాక్టీరియాలను, వైరస్‌‌లను నిమిషంలోపే 99 శాతం వరకు తొలగిస్తుంది.  దీనిని  వర్క్‌‌టేబుల్స్‌‌, చైర్స్‌‌, క్యాబిన్స్‌‌, కాన్ఫరెన్స్‌‌ గదులు,  మల్టీ ఫంక్షన్‌‌ ప్రింటర్లు, ఫోన్లు, ఇతర ఆఫీసు ప్రొడక్టులపై వాడవచ్చు. ధర 10,950 రూపాయలు.

మరిన్ని వార్తల కోసం..

ఓటేసినోళ్లకు డిస్కౌంట్లు

2022లో ఇస్రో తొలి ప్రయోగం విజయవంతం

సర్జికల్ స్ట్రైక్స్ పై నాకూ అనుమానాలున్నయ్