శర్వానంద్ హీరోగా సంపత్ నంది రూపొందిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘భోగి’. ప్రస్తుతం హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. కిరణ్ కుమార్ మన్నె ప్రత్యేకంగా నిర్మించిన ఈ భారీ సెట్‌లో ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా, స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ సీన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు.
ఈ కీలకమైన క్లైమాక్స్ సీన్స్‌లో శర్వా మోస్ట్ ఇంటెన్స్, రిస్కీ స్టంట్లతో తన నటనలో సరికొత్త కోణాన్ని ప్రజెంట్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుందని చెప్పారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ-–మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే ఈ కథ యాక్షన్, ఎమోషన్‌తో నిండిన పీరియడిక్ డ్రామాగా రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధా మోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
