మొదలైన శర్వానంద్ పెళ్ళిసందడి.. వైరల్ అవుతున్న వీడియో

మొదలైన శర్వానంద్ పెళ్ళిసందడి.. వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ఓ ఇంటివాడు కాబోతున్న  సంగతి తెలిసిందే. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రక్షిత(Rakshitha)తో జూన్ 3న శర్వా వివాహం జరగనుంది. ఈ వేడుక కోసం జైపూర్ లోని లీలా ప్యాలెస్ వేదిక కానుంది.  ఇందులో భాగంగా జూన్ 2న  మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేయడం వంటి పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఫంక్షన్ లో ఫామిలీ తో కలిసి శర్వానంద్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నేట్టింట వైరల్ గా మారింది.

ఈ మ్యారేజ్ కి టాలీవుడ్ నుంచి టాప్ సెలబ్రెటీస్ అందరూ హాజరు కానున్నారు. శర్వా స్నేహితులు రామ్ చరణ్(Ram charan), రానా(Rana)లు కూడా ఈ పెళ్ళిలో సందడి చేయనున్నారు. అలాగే రక్షితది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో.. పెద్దఎత్తున పొలిటికల్ లీడర్స్ కూడా పెళ్ళికి వచ్చే అవకాశం ఉంది. 

ఇక శర్వా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య(sriram aadithya)తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి(Krithi shetty) హీరోయిన్ గా నటిస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న శర్వ.. పెళ్లి కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.