మరో మూడ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఒకే ఒక జీవితం

మరో మూడ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఒకే ఒక జీవితం

‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శర్వానంద్. ఇంతలోనే తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేసేశాడు. రౌడీ ఫెలో, చల్‌‌‌‌ మోహన్‌‌‌‌ రంగా చిత్రాల ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు.  ఇది శర్వానంద్‌‌‌‌కి ముప్ఫై మూడో సినిమా. రాశీ ఖన్నా హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌‌‌‌. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. నిన్న పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌‌‌కి త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు. దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్రమ్ కలిసి స్ర్కిప్ట్‌‌‌‌ను కృష్ణ చైతన్యకు అందించారు. ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా అని, శర్వానంద్‌‌‌‌ని ఇంటెన్స్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో చూపిస్తానని కృష్ణ చైతన్య చెప్పాడు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామన్నారు నిర్మాతలు.