
కోవిడ్ కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. అడివి శేష్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అతను హీరోగా శశికిరణ్ తిక్క రూపొందిస్తున్న చిత్రం ‘మేజర్’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 11న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల ‘హృదయమా’ అనే పాటను విడుదల చేసి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. కానీ ప్యాండమిక్ కారణంగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఎక్కువుండడంతో పాటు కొన్ని చోట్ల కర్ఫ్యూ కూడా ఉంది. అందుకే సినిమాను ప్రస్తుతానికి ఆపుతున్నట్టు చెప్పారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామన్నారు. ముంబై టెర్రర్ అటాక్స్‌లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఇది. శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. మహేష్ బాబుతో కలిసి సోనీ పిక్చర్స్ నిర్మిస్తోంది.