
న్యూ ఢిల్లీ : కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న శత్రుఘ్న సిన్హాపై బీజేపీ పరోక్షంగా చర్యలు తీసుకుంది. పొమ్మనలేక పొగబెట్టినట్లు లోక్ సభ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ స్థానాన్ని కేంద్రమంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ కు కేటాయించింది. దీనిపై శత్రుఘ్న స్పందిస్తూ.. ఈ ఎన్ని కల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ మారడానికీ వెనకాడనంటూ సిన్హా హైకమాండ్‌ను హెచ్చరించారు.
పాట్నా సా హిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున శత్రుఘ్న బరిలోకి దిగనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని సిన్హా ఖండించకపోగా తాను ఎక్కడి నుంచి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననే విషయంపై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పారు. సీటు కోసం కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. శత్రుఘ్న సిన్హా పలుమార్లు మోడీని బహిరంగంగానే విమర్శించారు.