యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడవుతున్నాడు

యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడవుతున్నాడు

యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడవుతున్నాడు. ఈ నెలలోనే తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. శౌర్య పెళ్లి వివరాలను గురువారం  అధికారికంగా ప్రకటించారు. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష. నవంబర్ 20న బెంగుళూరులోని జేడబ్ల్యూ మారియట్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌లో ఉదయం 11.25 నిమిషాలకు వివాహం జరగనుంది. 19న జరిగే మెహందీ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌తో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి. అనూష శెట్టిది కర్ణాటక రాష్ట్రం మంగుళూరు దగ్గరలోని కుందాపూర్. ఇంటీరియర్ డిజైనింగ్‌‌‌‌‌‌‌‌లో ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ అయిన ఆమె, పలు ప్రముఖ కంపెనీలకు డిజైనర్. వీళ్లిద్దరికీ బెంగళూరులో పరిచయమై, తర్వాత అది ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు.  మొత్తానికి తెరపై లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌‌‌‌‌గా, హ్యాండ్సమ్ హీరోగా ఆకట్టుకున్న నాగశౌర్య, రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లో బ్యాచిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌కి బై బై చెబుతున్నాడు.