
హైదరాబాద్, వెలుగు: ఆభరణాల బ్రాండ్ క్యారట్‌లేన్, హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇది 329వ స్టోర్ కాగా, హైదరాబాద్‌లో 19వ దని తెలిపింది. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా, క్యారట్‌లేన్ వజ్రాభరణాలపై 30 శాతం భారీ రాయితీని ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ జులై 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. నాణ్యమైన వజ్రాలను సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని క్యారట్‌లేన్ తెలిపింది.