‘డర్టీ పిక్చర్’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరు నటిస్తారు..?

‘డర్టీ పిక్చర్’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరు నటిస్తారు..?

రెండు రోజులుగా బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక విషయంపై సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. ‘డర్టీ పిక్చర్’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరు నటిస్తారనేదే ఆ విషయం. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఏక్తాకపూర్ నిర్మించిన ‘డర్టీ పిక్చర్’ సెన్సేషన్ సృష్టించింది. సిల్క్ పాత్రలో జీవించి విద్యాబాలన్ నేషనల్ అవార్డును సైతం అందుకుంది. పదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏక్తా కపూర్, రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనికా థిల్లాన్ ఆల్రెడీ అదే పనిలో ఉన్నారనే విషయం బైటికి పొక్కడంతో ఒక్కసారిగా అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ఈసారి లీడ్ రోల్ ఎవరు చేస్తారంటూ చర్చ మొదలైంది. ఈసారి విద్య నటించనని చెప్పడంతో కంగనా అయితే బాగుంటుందని ఏక్తా అనుకున్నారట. కానీ ఆమె కూడా నో అనడంతో కృతీ సనన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

తాప్సీ పేరు కూడా వినిపించింది కానీ చివరికి కృతికే చాన్స్ దక్కిందంటున్నారు. ‘మిమి’ మూవీలో సరొగేట్ మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తన మెచ్యూర్డ్ నటనకి ఇంప్రెస్ అయ్యి ఈ అవకాశం ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే కృతి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక అద్భుతమైన పాత్ర పడుతుంది. ఆమె కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఊహించని మలుపు తిరిగే అవకాశమూ ఉంది. అయితే ‘డర్టీ పిక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో సిల్క్ మరణంతో ఆమె కథ ముగిసిపోయింది. మరి సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏం చూపించబోతున్నారు? మరో నటి లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? వేచి చూడాలి.