మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్ ప్రశంసలు

మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్  ప్రశంసలు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మీరాబాయి చాను తొలి స్వర్ణం అందించింది.  49కిలోల విభాగంలో ఈ స్టార్ లిఫ్టర్ పిసిడి పతకాన్ని సాధించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది చాను. ఈ నేపథ్యంలో బరువులు ఎత్తడాన్ని ఉద్ధేశిస్తూ ఓ నెటిజన్ ఆమె ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ థోర్ తన సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చిందని కామెంట్ చేశాడు.

దీనికి హాలివుడ్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ ను ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా మీరాబాయి చానుపై క్రిస్ హేమ్స్వర్త్ ప్రశంసలు కురిపించారు. ఆమె యోగ్యురాలు, కంగ్రాట్స్ సిఖోమ్..నువ్వో లెజెండ్ అంటూ ట్వీట్ చేశారు. కాగా థోర్ సినిమాల్లో క్రిస్ ఎక్కువగా సుత్తితో కనిపిస్తారు. అందులోని సుత్తిని ఎత్తగల ప్రత్యేక శక్తులు ఆయనకే ఉంటాయి. 

కాగా 2014 కామన్వెల్త్ గేమ్స్ లో సిల్వర్ , 2018లో చాను గోల్డ్ మెడల్ సాధించింది. 2017 వరల్డ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు అనేక ఈవెంట్లలో ఆమె పతకాలు కొల్లగొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చానునే. అంతేకాదు ఏకైక మహిళా వెయిట్‌ లిఫ్టర్‌గానూ నిలిచింది.