
పెండ్లి చేసుకునేందుకైనా, ఆ బంధం వద్దు అని విడాకులు తీసుకోవాలన్నా.. కచ్చితంగా ఆ బంధంలో ఇద్దరు మనుషులు ఉండాల్సిందే. కానీ, బ్రెజిల్‌కి చెందిన మోడల్ క్రిస్ స్టోరీలో మాత్రం అలా కాదు. పెండ్లికి ఆమె ఒక్కతే ఉంది. ఎందుకంటే ఆమెను ఆమే పెండ్లి (సెల్ఫ్ మ్యారేజ్) చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఆమే విడాకులు ఇచ్చుకుంది. పెండ్లైన 90 రోజులకే క్రిస్ ఆ పని చేసింది. ‘నా సోల్‌మెట్ దొరికాడు. అందుకే, నాకు నేను విడాకులు ఇచ్చుకుంటున్నా” అని చెప్పింది. బ్రెజిల్‌కి చెందిన 33 ఏండ్ల ఫేమస్ మోడల్ క్రిస్‌కి మగవాళ్ల మీద నమ్మకం లేదట. తను పెరిగిన వాతావరణం, పరిస్థితుల వల్ల ఆమెకు మగవాళ్లపై ద్వేషం పెరిగింది. అందుకే, పెండ్లి చేసుకోకుండా జీవితాంతం అలానే ఉండాలనుకుంది. అందుకే, తనను తాను పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందseర్నీ పిలిచి బ్రెజిల్‌లోని ఫేమస్ చర్చిలో పెండ్లి చేసుకుంది. అప్పట్లో ఆమె దిగిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ, ఇప్పుడు తనకు బాయ్‌ఫ్రెండ్ దొరకడంతో విడాకులు ఇచ్చుకుంది. ‘ఆమెతో ఆమెకు గొడవైందేమో. అందుకే, విడాకులు ఇచ్చుకుంది’ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.