ఈటల రాజీనామా వల్లే గొర్రెలు వచ్చాయి 

V6 Velugu Posted on Jul 28, 2021

మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్ రాజీనామా కారణంగానే తమకు గొర్రెలు వచ్చాయంటున్నారు గొల్ల కురుమలు. డీడీలు తీసి మూడేళ్లు దాటినా ప్రభుత్వం గొర్రెలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈటల రాజీనామా చేసిన తర్వాతే ఉప ఎన్నికల కోసమే ప్రభుత్వం హడావిడిగా గొర్రెలు ఇస్తుందని విమర్శించారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి తలసాని గొర్రెలు పంపిణీ చేశారు. ప్రభుత్వం తాజాగా ఇస్తున్న గొర్రెలు కూడా యూనిట్ కాస్ట్ కు సరిపడా ఇవ్వకుండా చిన్న పిల్లలను ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గొల్ల కురుమలు.

Tagged Karimnagar, etela,  sheep, resignation

Latest Videos

Subscribe Now

More News