
నిర్మల్ : జిల్లాలోని ముథోల్‌లో గొర్రెలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 గొర్రెలు మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారుగా ఈ లారీలో 300 గొర్రెలు ఉన్నట్లు పోలిసులు తెలిపారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు గొర్రెలు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.