పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్ ర్యాంక్

పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్ ర్యాంక్

న్యూఢిల్లీ : పారా ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో రెండు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా పారా ఆర్చర్ శీతల్ దేవి పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా జాబితాలో  విమెన్స్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో రెండు స్థానాలు ఎగబాకి వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ గా నిలిచింది. మరోవైపు పారా ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మూడు బంగారు పతకాలు సాధించిన రాకేష్ కుమార్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానం సాధించాడు.  ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్ గెలిచిన సరిత ఏడు స్థానాలు మెరుగై  ఆరో ర్యాంక్ అందుకుంది.