బడ్జెట్ ను తగ్గించిన నేపాల్ ప్రభుత్వం

బడ్జెట్ ను తగ్గించిన నేపాల్ ప్రభుత్వం

బడ్జెట్ ను తగ్గించింది నేపాల్ ప్రభుత్వం. KP శర్మ ఓలి ప్రభుత్వం గతంలో 1.632 ట్రిలియన్ల నేపాలీ రూపాయలతో ఈ ఏడాది మేలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత KP ఓలి ప్రభుత్వం కూలిపోయింది. షేర్ బహదూర్ దేవుబా అధికారంలోకి వచ్చారు. బడ్జెట్ ను కుదించాలని నిర్ణయించుకున్న షేర్ బహదూర్ దేవుబా ప్రభుత్వం... 16.74 బిలియన్ల నేపాలీ రూపాయలు కోత పెట్టింది. ఫ్యూయల్, అలోవెన్స్, వెహికిల్స్, ఇతర మెయిన్ టెనెన్స్ కు సంబంధించి 10 శాతం కోత పెట్టారు. సవరించిన బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మ.