
తన అందం, అభినయంతో ఆకట్టుకునే షెర్లిన్ చోప్రా బాలీవుడ్తో పాటు..టాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించింది. అయితే ఈ మధ్య కాలంలో షెర్లిన్ చోప్రా నగ్న ఫోటోలు, బోల్డ్ కామెంట్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి హాట్ కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా రాహుల్ గాంధీపై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై షెర్లిన్ చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
- ALSO READ: రాహుల్‌కు వండి, వడ్డించిన లాలూ
రాహుల్ గాంధీపై సంచలన కామెంట్..
మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌గాంధీకి ఊరట లభించగా.... దానిపై షెర్లిన్ చోప్రాను మీడియా ప్రశ్నించింది. అయితే ఈ కేసులో రాహుల్‌గాంధీకి రిలీఫ్ దొరకడం సంతోషంగా ఉందని షెర్లిన్ చోప్రా హర్షం చేసింది. ఈ సమయంలో ఓ జర్నలిస్టు...షెర్లిన్ చోప్రాను సంచలన ప్రశ్న అడిగాడు. రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించాడు. దీంతో మరో మాట లేకుండా హ పెళ్లి చేసుకుంటా అని సమాధానం చెప్పింది. రాహుల్ గాంధీని వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని షెర్లిన్ తన మనసులోని మాటను బయటపెట్టింది.
కానీ ఒక కండీషన్...
రాహుల్ గాంధీని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని జర్నలిస్టును ఎదురుప్రశ్న వేసింది షెర్లిన్ చోప్రా. అందులో తప్పేముందని అడిగింది. అయితే రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలంటే ఒక కండీషన్ అని చెప్పింది. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంటి పేరును మార్చుకోను అని స్పష్టం చేసింది. పెళ్లి అయిన తర్వాత కూడా సర్‌నేమ్ చోప్రాగానే ఉంటుందని చెప్పింది.