మిస్ ​యూనివర్స్ ​పలాసియోస్

మిస్ ​యూనివర్స్ ​పలాసియోస్

మిస్‌‌ యూనివర్స్‌‌ 2023 టైటిల్​ఈ ఏడాది నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ సొంతం చేసుకుంది. మాజీ విశ్వ సుందరి ఆర్‌‌ బానీ గాబ్రియేల్‌‌.. ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. 

ఈ పోటీల్లో థాయ్‌‌లాండ్‌‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌‌గా నిలిచారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా.. టాప్ 20లో నిలిచారు.