నేడు సౌతాఫ్రికాతో ఇండియా మూడో వన్డే మ్యాచ్

నేడు సౌతాఫ్రికాతో ఇండియా మూడో వన్డే మ్యాచ్

మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు
మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

న్యూఢిల్లీ : తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు మెప్పించారు. రెండో వన్డేలో వారితో పాటు బౌలర్లూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తడాఖా చూపెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో వన్డేలో ఓపెనర్లపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకోవాలని శిఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలోని ఇండియా కృత నిశ్చయంతో ఉంది.  మొదటి పోరులో కొద్దిలో విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా.. రాంచీలో  సఫారీలను రఫ్ఫాడించి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమం చేసింది. ఆఖరాటలోనూ అదే జోరు చూపెట్టాలనుకుంటోంది.

అంతా బాగానే ఉన్నప్పటికీ ఓపెనర్లు ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఆందోళన నెలకొంది.  తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైన ఈ ఇద్దరూ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వన్డేలకే పరిమితమై రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 17 రన్సే చేశాడు. వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కన్నేసిన ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి ఆరంభం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాలను గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగ్గా యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం లేదు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్లక్ష్యంగా  ఔటైన తను రాంచీలో కొన్ని రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.

జట్టులో చోటుకు పోటీ ఎక్కువైన నేపథ్యంలో పరుగులు చేస్తేనే స్థానం ఉంటుందని గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తుంచుకోవాలి. ఇక, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. వీళ్లు ఇదే జోరు కొనసాగిస్తే  ఇండియా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గడం పెద్ద కష్టమేం కాబోదు. ఇక తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరిచిన తర్వాత రెండో పోరులో సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.  మరోసారి అదే పెర్ఫామెన్స్ రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రాకు రిప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులో సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా ముందుకొస్తాడు. స్పిన్నర్లు షాబాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఆకట్టుకుంటున్నారు. 

ఒత్తిలో సఫారీలు
 రాంచీలో తేలిపోయిన సౌతాఫ్రికా ఒత్తిడిలో పడిపోయింది. ఐసీసీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక పాయింట్లు అందుకోవాలని చూస్తున్న సఫారీలకు గత పోరులో దెబ్బపడింది. ప్రస్తుతం   పట్టికలో 11వ స్థానంలో ఉన్న సఫారీలు.. వచ్చే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు నేరుగా అర్హత సాధించలేని ప్రమాదంలో ఉన్నారు. మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయం ఆ జట్టుకు కీలకం కానుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బవూమ గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండగా.. స్టాండిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఇప్పుడు బవూమ తిరిగొచ్చి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకోవడంతో పాటు సఫారీ టీమ్​ సమష్టిగా ఆడితేనే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయం సాధించగలదు. మరోవైపు ఢిల్లీలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వర్ష సూచన ఉండటం ఆందోళన కలిగిస్తోంది.