మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ రీ ఎంట్రీ

మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ రీ ఎంట్రీ

మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లి శిల్పా శిరోద్కర్ నటిస్తున్న చిత్రం ‘జటాధర’. సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు తన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. 

ఇందులో శోభగా శిల్పా శిరోద్కర్ కనిపించనుందని రివీల్ చేశారు. గతంలో మోహన్‌‌‌‌ బాబు సినిమా ‘బ్రహ్మ’లో నటించిన శిల్పా శిరోద్కర్‌‌‌‌‌‌‌‌ మూడు దశాబ్దాల తర్వాత ఈ  చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. సోనాక్షి సిన్హా నెగిటివ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌‌‌‌ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు.