శింబుతో దీపికా.. కానీ ఛాన్సెస్ తక్కువే

శింబుతో దీపికా.. కానీ ఛాన్సెస్ తక్కువే

తమిళ స్టార్ హీరో శింబు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన తరువాతి సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం శింబు  కనులు కనులు దోచాయంటే ఫేమ్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా నుండి తాజాగా వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈసినిమాలో శింబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను రంగంలోకి దించాలని టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పొజీషన్‌లో కొనసాగుతున్న దీపిక.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. మరి ఇలాంటి టైమ్ లో ఆమె  శింబుతో కలిసి సినిమా చేయడానికి ఒప్పుకుంటుందా అనేది ప్రశ్నగానే ఉంది.

అయితే.. ఈసినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా ఉన్నారు. మరి ఆయన అడిగితే కాదనదన్న నమ్మకంతో ఉన్నారేమో మేకర్స్. ఒకవేళ ఒప్పుకున్నా దీపికా రెమ్యూనరేషన్ పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే దీపికా ఈ సినిమా చేసే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి.