విమానంలో చొక్కా విప్పి మరీ కొట్టిండు

విమానంలో చొక్కా విప్పి మరీ కొట్టిండు

విమానాల్లో ప్రయాణికులు కొట్టుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ఏదో ఒక కారణంతో ప్రయాణికులు తరచూ గొడవలకు దిగుతున్నారు. ఇటీవలే   బ్యాంకాక్ నుంచి కోల్కతాకు వస్తున్న థాయిలాండ్ థారు ఎయిర్ వేస్ లో ఇద్దరు యువకులు కొట్టుకున్న ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా అలాంటి ఘటనే బంగ్లాదేశ్ విమానంలో జరిగింది. ఇద్దరు ప్రయాణికులు  కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. బిటాంకో బిశ్వాస్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.అయితే ఈ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది..వాళ్లు ఎందుకు గొడవ పడ్డారనేది అతను చెప్పలేదు. 

ఓ వ్యక్తి షర్ట్ విప్పి సీట్లో కూర్చున్న మరో ప్యాసింజర్ ను చితకబాదిండు. ఎంత మంది వచ్చి ఆపినా ఆగకుండా అతడి మొహంపై పిడిగుద్దులు గుద్దిండు. కొందరు అతన్ని అడ్డుకునేందుకుప్రయత్నింగా.. మరి కొందరు వీడియో తీస్తున్నారు.