ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరి పోరాటమే

ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరి పోరాటమే

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవ్వడంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికల, ప్రచార వ్యూహాలతో జిజీబిజీగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న యూపీ ఎన్నికలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. తమ ఐడియాలజీకి సమాజ్ వాదీ పార్టీ సెట్ కాదన్నారు. యూపీలో మార్పు కోరుకుంటున్నామని చెప్పారు. తమ అభ్యర్థులు పోటీ చేయకున్నా.. గతంలో ఎలక్షన్స్ కోసం పనిచేశామని తెలిపారు. బీజేపీని బాధ పెట్టొద్దనే ఇన్నేళ్లు తమ అభ్యర్థుల్ని బరిలో దింపలేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ

74 ఏండ్ల తర్వాత.. అన్నదమ్ములను కలిపిన కారిడార్

లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్