Shiva4K Contest: కల్ట్-క్లాసిక్ ‘శివ’ట్రైలర్ క్రియేట్ చేసినోళ్లకు.. నాగ్-ఆర్జీవీలను కలిసే ఛాన్స్!

Shiva4K Contest: కల్ట్-క్లాసిక్ ‘శివ’ట్రైలర్ క్రియేట్ చేసినోళ్లకు.. నాగ్-ఆర్జీవీలను కలిసే ఛాన్స్!

కింగ్ నాగార్జున-రామ్ గోపాల్ వర్మల ఐకానిక్ కల్ట్-క్లాసిక్ మూవీ ‘శివ’ (Shiva). 1989లో విడుదలైన ఈ మూవీ, 2025 నవంబర్ 14న 4K డాల్బీ అట్మాస్ క్వాలిటీతో రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శివ మూవీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ కంపీటీషన్తో ఇన్విటేషన్ అందించింది. కల్ట్-క్లాసిక్ శివ మూవీకి సంబంధించిన ట్రైలర్లు & పోస్టర్లలను తమ స్వంత వెర్షన్‌లతో క్రియేట్ చేయండి అంటూ ఒక ప్రత్యేక పోటీని ప్రకటించింది.

శివకి సంబంధించి తమ వీడియో ఎడిట్‌లు, పోస్టర్ డిజైన్‌లు మరియు కాన్సెప్చువల్ ఆర్ట్‌వర్క్‌లను #Shiva4KContest ద్వారా X లేదా Instagramలో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ట్యాగ్ చేసి అప్‌లోడ్ చేయవచ్చని పోస్టులో వివరాలు వెల్లడించింది.

ఈ ప్రత్యేక పోటీలో గెలిచిన మొదటి ముగ్గురు విజేతలకు స్పెషల్ ఆఫర్ ఇవ్వనుంది. నాగార్జున మరియు ఆర్జీవీను కలిసే ప్రత్యేక అవకాశం విజేతలకు లభిస్తుందని తెలిపింది. అయితే, తమ ఎంట్రీలను వచ్చే నెల అక్టోబర్ 20వ తేదీ వరకు పంపగలరని, ఆలస్యం చేయకుండా మీ క్రియేటివిటీకి పదునుపెట్టండని అన్నపూర్ణ స్టూడియోస్ కోరింది. సో.. ఇక ఆలస్యం చేయకుండా శివ టీమ్తో భాగస్వామ్యం అవ్వండి!!

ALSO READ : గొప్ప మనసు చాటుకున్న నటుడు నానా పటేకర్..

సెప్టెంబర్ 20 ANR 101వ జయంతిని పురస్కరించుకుని, నాగార్జున తిరిగి విడుదల తేదీని వెల్లడించారు. “సినిమాకు తరాలను దాటి జీవించే శక్తి ఉందని నాన్న ఎప్పుడూ నమ్మేవారు, శివ అలాంటి సినిమాలలో ఒకటి. నవంబర్ 14న పూర్తిగా కొత్త అవతారంలో 4K డాల్బీ అట్మాస్‌లో దాన్ని తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావడం కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే ఆయన కలకు నివాళి” అని ఆయన అన్నారు.