ముష్టి బ్యాచ్‌.. ముష్టినాయాళ్లు.. అమర్ను టార్గెట్ చేసిన శివాజీ.. మండిపడుతున్న అమర్ ఫ్యాన్స్

ముష్టి బ్యాచ్‌.. ముష్టినాయాళ్లు.. అమర్ను టార్గెట్ చేసిన శివాజీ.. మండిపడుతున్న అమర్ ఫ్యాన్స్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) ముగింపుకు దశకు చేరుకున్నా.. అమర్(Amar) ను టార్గెట్ చేయడం మానలేదు శివాజీ(Shivaji). అమర్ ముందు బాగానే మాట్లాడుతున్న శివాజీ వెనుకాల మాత్రం చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అమర్ శివాజీకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. తనకన్నా సీనియర్ కావడంతో శివాజీ చేస్తున్న కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవడంలేదు అమర్. నిజానికి అమర్ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. 

ఏమైనా అంటే సరదాగా అన్నాను అంటాడు కానీ.. అదే సరదాలో పల్లవి ప్రశాంత్ ను గానీ, యావర్ ను గానీ ఇప్పటివరకు అలాంటి మాట ఒక్కటి అనలేదు. ఇదెక్కడి న్యాయం అని అమర్ ఫ్యాన్స్ అంటున్నారు. వేస్ట్‌ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా చాలా మాటలే అన్నాడు శివాజీ. కేవలం ఆయనపై ఉన్న గౌరవంతోనే అవన్నీ భరించారు అమర్ అంటున్నారు ఫ్యాన్స్. 

ఇక తాజాగా సీజన్ ఎండింగ్ లో కూడా అమర్ ను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేశాడు శివాజీ. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు తమ పర్ఫామెన్స్‌ ఆధారంగా రోజులో 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ ఓక టాస్క్ ఇచ్చాడు. ఇందులో పెద్దగా సీరియస్ తీసుకోవడానికి ఏమీ లేదు. నిజానికి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ అలానే తీకున్నారు ఒక్క శివాజీ తప్ప. అది కేసుల కేవలం అమర్ విషయంలో మాత్రమే ఆయన కామెంట్ చేయడం అమర్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టింది. 

ఎవరికీ తక్కువ బోర్డు ఇవ్వబుద్ధి కావడం లేదు అంటూనే.. అమర్‌ మెడలో మాత్రం 3 నిమిషాల బోర్డు వేసి మళ్ళీ టార్గెట్ చేశారు. నువ్వు అస్సలు గేమ్ ఆడలేదని, గత 2 వారాల నుండి మాత్రమే ఆడావని, కొన్నిసార్లు కావాలనే నెగెటివ్‌ కంటెంట్‌ కోసం ప్రయత్నించావంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దానికి అమర్ కూడా ఒకింత షాకై.. నేను ఈ 3 నిమిషాలు యాక్సెప్ట్‌ చేయలేకపోతున్నా అన్నా, గేమ్‌ ఆడానన్నా అన్నాడు. దానికి శివాజీ మళ్ళీ నేనే 5 వేసుకున్నప్పుడు.. నువ్వు 3 నిమిషాలు తీసుకోవడానికి రోగమా? అన్నాడు శివాజీ. అంతటితో ఆగకుండా.. తన భజన పార్టీ యావర్, పల్లవి ప్రశాంత్ లకు మాత్రం 15, 20 బోర్డులను ఇచ్చాడు. అనంతరం తన గ్యాంగ్ తో జరిగిన డిస్కషన్ లో మాట్లాడుతూ.. అమర్ డీప్ బ్యాచ్ ను ఉద్దేశిస్తూ.. ముష్టి బ్యాచ్‌.. ముష్టినాయాళ్లు.. అంటూ చాలా ,దారుణమైన కామెంట్స్ చేశాడు. 

దీంతో ఫైర్ అవుతున్న అమర్ ఫ్యాన్స్.. ఇది ఫెవరిజం కాదా.. పక్కవారిని కావాలని డీగ్రేడ్ చేసి తన వాళ్ళకి మాత్రం ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం ఎంతవరకు కరక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సీజన్ కంప్లీట్ అవనుంది ఈ సమయంలో కూడా ఇలాంటి కామెంట్స్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.