మహీని చూసి నేర్చుకున్నా: శివమ్‌‌‌‌ దూబె

మహీని చూసి నేర్చుకున్నా: శివమ్‌‌‌‌ దూబె

చెన్నై: తమ మాజీ కెప్టెన్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌ ధోనీని చూసి మ్యాచ్‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌ కళను నేర్చుకున్నానని సీఎస్కే ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ శివమ్‌‌‌‌ దూబె వెల్లడించాడు. వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌‌‌‌ అని కొనియాడాడు. ‘ఫినిషింగ్‌‌‌‌ అనేది అద్భుతం. చెన్నై కోసం మ్యాచ్‌‌‌‌ను గెలిపించడం ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరిచే విషయం. ఆ ఫినిషింగ్‌‌‌‌ కళను మహీని చూసి నేర్చుకున్నా. 

ప్రతి మ్యాచ్‌‌‌‌లో ఫినిషర్‌‌‌‌గా  నా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంటా. ఉత్కంఠభరిత మ్యాచ్‌‌‌‌లను ఫినిష్‌‌‌‌ చేయడం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ముఖ్యంగా సీజన్‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌లోనే ఇది జరగడం చాలా ప్రత్యేకమనిపించింది’ అని దూబె పేర్కొన్నాడు. కఠినమైన ఛేజింగ్‌‌‌‌ను రచిన్‌‌‌‌ రవీంద్ర, రుతురాజ్‌‌‌‌ బాగా ప్రారంభించారన్నాడు. రహానెతో కూడా కీలక పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ నెలకొల్పడం తమ విజయానికి దోహదం చేసిందన్నాడు. పిచ్‌‌‌‌ కూడా బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలించిందని దూబె వ్యాఖ్యానించాడు.