పశువులు లేకుండా మానవ మనుగడ లేదు

పశువులు లేకుండా మానవ మనుగడ లేదు

ఆవులు, వాటి పేడ, మూత్రం వినియోగంపై సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయొచ్చన్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. భోపాల్ లో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ మహిళా విభాగం సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పశువులు లేకుండా మానవ మనుగడ లేదని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు గో పూజ, గోవర్ధన పూజ ప్రారంభించారన్నారు శివరాజ్ సింగ్ చౌహన్. గోవు పేడ, మూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పారు. గోవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి

టిక్కెట్ల రేట్లపై జగన్‌ను కలవనున్న RRR టీమ్