షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. సానియా మీర్జాకు విడాకులు

షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. సానియా మీర్జాకు విడాకులు

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తల మధ్య.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పాకిస్తాన్ సంప్రదాయం ప్రకారం.. పాకిస్తాన్ లో ఈ పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు ఎవరో కాదు.. పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ మోడల్, నటి అయిన సనా జావేద్. తన పెళ్లి ఫొటోలను ఇన్ స్ట్రాలో పోస్ట్ చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అల్లా మమ్మల్ని జంటగా సృష్టించారు అని కామెంట్ చేశాడు.

షోయబ్ మాలిక్ పెళ్లి ఫొటోలు బయటకు రావటంతో.. సానియా మీర్జాతో విడాకులు అనేది కన్ఫామ్ అయినట్లే.. కొన్ని రోజుల క్రితం విడాకుల అంశంపై సానియా కామెంట్లు చేయటం చూస్తుంటే.. అప్పటికే వీరి విడాకులు అయిపోయినట్లు.. ఇప్పుడు షోయబ్ కొత్త పెళ్లితో నిర్థారణ అవుతుంది. 

షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్లి. మొదటి భార్య అయేషా సిద్ధిఖీకి విడాకులు ఇచ్చిన తర్వాత.. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సానియాకు విడాకులు ఇచ్చి.. పాకిస్తాన్ నటి సనాను మూడో పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్ వయస్సు 41 ఏళ్లు.. సానియా వయస్సు 35 ఏళ్లు.