ఇండియన్ మూవీ డేటాబేస్ పోర్టల్ (ఐఎండీబీ) ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో శోభిత ధూళిపాళ రెండో స్థానంలో నిలిచి సర్‌ప్రైజ్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఆమె ఈ ఫీట్‌ను సాధించింది. ఈ వారం ఎక్కువమంది యూజర్స్ సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 1లో నటి శార్వరీ నిలిచింది.
శోభిత తర్వాతి స్థానాల్లో షారుక్ ఖాన్, కాజోల్, జాన్వీ కపూర్ ఉన్నారు. హీరో నాగ చైతన్యతో శోభిత దూళిపాళ నిశ్చితార్థ వేడుక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున ప్రకటించాక శోభిత పేరు మరింతగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా నెటిజన్స్ ఇంటర్ నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి, సినీ నేపథ్యం గురించి నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఈ వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా రెందో స్థానంలో శోభిత నిలిచింది.