
న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో.. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. లెగ్ ఇంజ్యురీ నుంచి కోలుకుంటున్న అతనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను మెగా టోర్నీకి అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న డౌట్స్ మొదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో బెయిర్‌స్టో తన కాలు, చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. దాని నుంచి అతను పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇక హండ్రెడ్ టోర్నీలో గాయపడి కోలుకున్న ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్)కు.. ఐపీఎల్ ఆడేందుకు ఈసీబీ క్లియరెన్స్ ఇచ్చింది. మోకాలు, చీలమండ గాయాల నుంచి కోలుకున్న లివింగ్‌స్టోన్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఐపీఎల్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు.