పిల్లలపై కొవోవాక్స్ క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్రం నో

V6 Velugu Posted on Jul 01, 2021

పిల్లలపై  వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)కు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దని నిపుణుల కమిటీ DCGIకి సిఫార్సు చేసింది. రెండు నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలపై కొవోవాక్స్ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పుడే వద్దని స్పష్టం చేసింది.  920 మంది పిల్లలపై జరిపేందుకు SII సోమవారం డీసీజీఐ అనుమతి కోరింది.

12 నుంచి 17 ఏళ్ల లోపున్న460 మందిపై, రెండు నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ట్రయల్స్ చేపట్టేందుకు అనమతి ఇవ్వాలని సీరం కోరింది. దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కోవోవాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందనలేదనే విషయాన్ని గుర్తించింది. దీంతో పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్‌కు ముందు ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించింది. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. 
 అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో 'కొవొవాక్స్‌' పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్‌ సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పటికే మార్చిలో 18ఏళ్లు పైబడినవారిపై టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది.

Tagged Serum Institute, children , Govt Panel, Test Covovax

Latest Videos

Subscribe Now

More News