viral video: సాహసమనే చెప్పుకోవాలి..! చైన్ కొట్టేసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు

viral video: సాహసమనే చెప్పుకోవాలి..!  చైన్ కొట్టేసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు

చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.  బైక్‪పై లేదా నడుచుకుంటూ వచ్చి  చైన్  స్నాచర్లు చోరీలకు పాల్పడతారు. కానీ ఓ కంత్రీ దొంగ తన ప్రాణాలకు తెగించి మరీ మహిళ మెడలో చైన్ కొట్టేశాడు. రన్నింగ్‪లో ఉన్న  ట్రైన్‌లో టాయింలెట్స్ దగ్గరకు వచ్చిన ఓ మహిళ మెడలోనుంచి గోల్డ్ చైన్ లాక్కొని స్పీడ్‪గా వెళ్తున్న ట్రైన్ నుంచి దూకేశాడు. రైలు బోగీ కంపార్ట్‪మెంట్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. టాయిలెట్ రూమ్స్ దగ్గరకి ఇద్దరు మహిళలలు వచ్చారు. దొంగ వారిలో ఒకరి మెడలో బంగారపు గొలుసు చూశాడు. 

పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసుకొని రెస్ట్ రూం వద్ద ట్రైన్ డోర్ దగ్గరకు వచ్చేంతవరకూ యువకుడు ఓపికగా వేచి ఉన్నాడు. అంత వరకు ఆ కేటుగాడు కోచ్ డోర్ దగ్గరే వేచి ఉన్నాడు. తన ముందునుంచి వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఒక్కసారిగా చైన్ లాక్కొని అమాంతం వేగంగా కదులుతున్న రైలు నుంచి దూకాడు. దీంతో రైలు బయట పట్టాలకు పక్కనే ఆ దొంగ పడిపోయాడు. ఆ యువకుడికి గాయాలు కూడా అయ్యింటాయి. ఈ దృశ్యాలంనీ ట్రైన్ లో ఏసీ బోగీ డోర్ దగ్గర ఉన్న సీసీటీపీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ చోరి మార్చి 13 సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో  యూజర్స్ షేర్ చేసుకుంటూ వైరల్ అవుతుంది.