
బాగా లావున్న కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడకొట్టిందట.. ఇది ఆ మధ్య ఆగడు సినిమాలో విన్న డైలాగ్. అంటే… నెక్స్ట్ సెకన్ లో పీసులు, పీసులు అయిపోతుందని దాని అర్థం. ఇలాగే…. ఓ నక్క … వేల కోళ్లు ఉన్న పౌల్ట్రీ ఫారంలోకి దూరి… అబ్బా.. నాకు కావాల్సినంత మాంసం దొరికిందివాళ అనుకుందట. సీన్ కట్ చేస్తే.. ఓ మూలకు శవమైపడిపోయింది ఆ నక్క. ఈ సీన్ ఫ్రాన్స్ లో జరిగింది.
నార్త్ వెస్ట్రన్ ఫ్రాన్స్ … బ్రిటనీలోని రూరల్ ఏరియాలో ఐదు ఎకరాల్లో ఓ అగ్రికల్చరల్ ఫామ్ లో కోళ్ల పరిశ్రమ ఉంది. ఎన్ క్లోజర్ లలో మొత్తం 6వేల కోళ్లు ఉన్నాయి. అక్కడి కోళ్ల ఫామ్ లోకి పక్కనే ఉన్న జంగిల్ నుంచి ఓ నక్క దూరింది. వేట కోసం వెతుకుతున్న నక్క.. కోళ్ల గుంపును గమనించి… పౌల్ట్రీ ఫామ్ లోకి ఎంటరైంది. అక్కడ వరుసగా ఉన్న కోళ్లను చూసి.. ఇవాళ పండుగే అనుకుంది. ఎదురుగా వచ్చి తమ ముందు నిలబడిన ప్రమాదాన్ని కోళ్లు కూడా పసిగట్టేశాయి. కోళ్లను అందుకోవడానికి ముందుకొచ్చిన నక్కపై గుంపుగుంపుగా దాడిచేసి పడేశాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. 3 వేల కోళ్లు… ఒక్కసారిగా వచ్చిన తమ శత్రువు నక్కపై ఎటాక్ చేశాయి. తమ ముక్కులతో పోటు మీద పోటేస్తూ…. నక్కను కుళ్లబొడిచేశాయి. నక్క పారిపోవచ్చుగా అనేకదా డౌట్. అక్కడే దానికి ఇంకో ప్రాబ్లమ్ వచ్చింది.
ఎన్ క్లోజర్లకు లాక్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్తే లాక్ పడిపోతుంది. కోళ్ల సెక్యూరిటీ కోసం పెట్టిన ఆ సిస్టమ్… నక్క ప్రాణాలమీదకు తెచ్చింది. లోపలికి వెళ్లి నక్క… డోర్ లాక్ కారణంగా బయటకు రాలేకపోయింది. పౌల్ట్రీ ఫామ్ యజమాని వచ్చి చూసేసరికి.. నక్క డెడ్ బాడీ మూలకు పడిఉంది. కోళ్లు తమ పని తాము చేసుకుంటున్నాయి. ఎదుటివాడి బలాన్ని చూసి ఎటాక్ చేయాలని ఊరికే అనలేదు పెద్దలు. ఏమంటారు?