Rashi Khanna: 'ఉస్తాద్ భగత్ సింగ్'పై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్.. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై ఎమోషనల్!

Rashi Khanna: 'ఉస్తాద్ భగత్ సింగ్'పై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్.. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై ఎమోషనల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న  చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తోంది..  ఈ మూవీపై సినీవర్గాలతో పాటు అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. లేటెస్ట్ గా ఈ మూవీ గురించి రాశీ ఖన్నా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వ్యా్ఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ తో కల నెరవేరింది..

తొలిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న రాశీఖన్నా.. ఈ సినిమా తన కెరీర్ లోనే అత్యంత ముఖ్యమైనదిగా తెలిపింది.  చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో కనిపిస్తోందీ బ్యూటీ.  అసలు ఈ మూవీ స్క్రీప్ట్ వినకుండానే తాను సైన్ చేసిన మొట్టమొదటి సినిమా కూడా ఇదేనని వెల్లడించింది.  తన కెరీర్ ప్రారంభం నుంచీ పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేయాలని కలలు కన్నాను. నేను పనిచేయాలని అనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. అందుకే హరీష్ శంకర్ గారు ఈ ఆఫర్ ఇవ్వగానే.. కథ కూడా వినకుండానే వెంటనే అంగీకరించాను అని రాశీ చెప్పింది.

పక్కా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్...

పవన్ కళ్యాణ్ నిజంగా శక్తిమంతుడు, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు. ఒక సంపూర్ణ మానవుడు అంటూ ప్రశంసలు కురిపించింది రాశీ. 'ఉస్తాద్ భగత్ సింగ్'  పక్కా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్. ఇందులో పాటలు, గ్లామర్ అన్నీ ఉంటాయి. ఇది పూర్తిగా కమర్షియల్ జోనర్ కాబట్టి, ఇందులో చాలా ఎక్కువ నటన ఆశించలేం. ఎందుకంటే ఆ లుక్స్, ఆ జానర్ దానంతట అదే చేస్తుంది అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.. 

దాదాపు మూడేళ్ల క్రితం అనౌన్స్ అయిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ ఇటీవల ఒక మేజర్ అప్‌డేట్ ఇచ్చారు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి రావడం ఖాయం అని ఆయన ప్రకటించారు.

ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గత చిత్రాలన్నింటి కంటే భారీ స్థాయిలో, పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ గుర్తుకొస్తుంది. అందుకే 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ 2026 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.