గుండెలపై అన్నగారు.. మార్క్ ఆంటోనీలో వెన్నుపోటుపై షాకింగ్ డైలాగ్

గుండెలపై అన్నగారు.. మార్క్ ఆంటోనీలో వెన్నుపోటుపై షాకింగ్ డైలాగ్

తమిళ స్టార్ విశాల్(Vishal) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ(Mark antony). సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు ఈ సినిమాతో సాలిడ్ హిట్ పడింది. ఎస్ జే సూర్య, సునీల్, రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. 

అయితే ఈ సినిమాలో విశాల్ వెన్నుపోటు అనే డైలాగ్ తో చంద్రబాబుపై సెటైర్స్ వేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన మార్క్ ఆంటోనీ సినిమాలో 1975 నేపథ్యంలోకి వెళ్ళినప్పుడు.. సీనియర్ ఎన్టీఆర్‌ నటించిన ఎదురులేని మనిషి సినిమాకు తన స్నేహితుడితో కలిసి థియేటర్‌కి వెళ్తాడు హీరో విశాల్. ఆ సమయంలో ఒకడు కత్తితో హీరోపై దాడి చేసి వెనుక నుండి పొడవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో హీరోకి వాడికి మధ్య తోపులాట జరుగుతుంది. ఈ క్రమంలో విలన్ షర్ట్‌ చిరిగిపోయి.. 

Also REad :- మరోసారి హార్ట్ను టచ్ చేయనున్న అనిత.. గెట్ రెడీ బాయ్స్

వాడి గుండెలపై ఎన్టీఆర్‌ బొమ్మ కనిపిస్తుంది. అది చుసిన హీరో.. అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికి వెన్నుపోటు పొడిచే అలవాటు లేదురా.. అంటాడు. దీంతో ఈ డైలాగ్ ను ఉద్దేశించే పెట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ డైలాగ్ పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.