
- గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న చిన్నారి
- మెదక్ జిల్లా అచ్చంపేటలో దారుణం
మెదక్ (నర్సాపూర్), వెలుగు: దంపతుల గొడవలో భాగంగా కూతురిని నేలకేసి కొట్టిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నర్సాపూర్ మండలం తుజాల్ పూర్ కు చెందిన ప్రశాంత్, ఇందు దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా.. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఇద్దరు పిల్లలతో ఇందు అదే మండలం అచ్చంపేటలోని పుట్టింట్లో ఉంటోంది.
ఆదివారం సాయంత్రం ప్రశాంత్ అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. అక్కడ చిన్న కూతురు రియాన్షిక(02) తనకు పుట్టలేదంటూ కోపంతో తండ్రి నేలకేసి కొట్టడడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ శివారులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. సోమవారం ఇందు ఫిర్యాదుతో నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.