అధికార పక్షపాత వైఖరికి ఇదే నిదర్శనం.. ఐపీఎస్ ఆత్మహత్య ఘటనపై సోనియా

అధికార పక్షపాత వైఖరికి ఇదే నిదర్శనం.. ఐపీఎస్ ఆత్మహత్య ఘటనపై సోనియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా ఐపీఎస్​ అధికారి ఆత్మహత్యపై కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ సోనియాగాంధీ స్పందించారు. ఈ ఘటన సర్వీస్​ లో ఉన్న ఉన్నతాధికారులకే అధికారంలో ఉన్న వారి వేధింపులు తప్పడం లేదని , అధికార పక్షపాత వైఖరికి ఇదొక భయంకరమైన నిదర్శనం అని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సామాజిక న్యాయం  ఏపాటి అమలు అవుతుందో చూపించేందుకు ఇదొక ఉదాహరణ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న సీనియర్​ ఐపీఎస్​ అధికారి భార్య కు సంఘీభావం తెలిపారు. 

 చండీగఢ్ లో ఆత్మహత్య చేసుకన్న హర్యానా సీనియర్ ఐపీఎస్ పురాణ్ కుమార్ భార్య అమ్నీత్ కుమార్ కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ విషాదకరమైన మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది అత్యంత బాధాకరం..ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు సోనియాగాంధీ. 

అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హోదాలో ఉన్న పురాన్ కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పురాన్​ తన ఆత్మహత్యకు ముందు ఏడు పేజీలు సూసైడ్​నోట్​  రాశారు. 16 మంది సీనియర్ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారుల పేర్లను పేర్కొంటూ వారు వేధింపులకు పాల్పడ్డారని,తాను ఆత్మహత్య చేసుకునేందుకు వారేబాధ్యులని రాశారు. 

మరోవైపు పురాన్ ఆత్మహత్యతో పెరుగుతున్న ఒత్తిడి మధ్య  పలువురుపోలీసులపై చర్యలు చేపట్టింది. హర్యానా ప్రభుత్వం రోహ్తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజ్రానియా స్థానంలో సురీందర్ సింగ్ భోరియాను నియమించింది. 

 రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ సింగ్ కపూర్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపే విషయాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. పోలీసు శ్రేణుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికి అధికారిక డిజిపి ని కూడా నియమించవచ్చని భావిస్తున్నారు.