ప్రియురాలి కోసం భారీ స్కెచ్ !.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

ప్రియురాలి కోసం భారీ స్కెచ్ !.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

గద్వాల, వెలుగు: సర్వేయర్  తేజేశ్వర్  మర్డర్  కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్  హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు విస్తుపోయే నిజాలను రాబట్టారు. వాయిస్  చేంజ్  డివైజ్ తో పాటు జీపీఎస్  ట్రాకర్లు, హత్యకు ఉపయోగించిన మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ కు చెందిన ఐశ్వర్య కు, అక్కడి ఓ బ్యాంకులో పని చేసే తిరుమలరావు పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. 

ఈ క్రమంలో ఐశ్వర్యపై అనుమానం ఉండడంతో ఆమె స్కూటీకి పెళ్లికి ముందే జీపీఎస్  ట్రాకర్  అమర్చాడు. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎవరిని కలుస్తుంది? ఎప్పుడు ఇంటికి వస్తుంది? అనే విషయాన్ని తెలుసుకొని ఆమెను గైడ్ చేసేవాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా, తిరుమలరావు భార్య ఒప్పుకోకపోవడంతో ఊరుకున్నాడు.

పెళ్లయినప్పటి నుంచే మర్డర్  ప్లాన్..

ఐశ్వర్యకు పెళ్లయిన రోజు నుంచే తేజేశ్వర్ ను హత్య చేసేందుకు తిరుమల్ రావు ప్లాన్ వేశాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన బైక్​కు జీపీఎస్  ట్రాకర్ అమర్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఐశ్యర్యతో టచ్ లో ఉండేందుకు బ్యాంకులో వాయిస్  చేంజ్  డివైజ్ (మగవాళ్లు మాట్లాడినా ఆడవారి వాయిస్  వచ్చేలా)ను ఏర్పాటు చేసుకున్నాడు. 

ఈ కేసులో నిందితులుమోహన్, తిరుపతయ్య, సుజాతలను కూడా పోలీస్  కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్  దాఖలు చేయనున్నారు. అవసరమైతే మరోసారి ఐశ్యర్య, తిరుమలరావును కస్టడీకి కోరే అవకాశాలున్నాయి. తేజేశ్వర్  హత్య కేసులో ఎంక్వైరీ కొనసాగుతోందని సీఐ శ్రీనివాస్​ తెలిపారు.