అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతంలో ఆకస్మాత్తుగా పెద్ద గుంత ఏర్పడింది.. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే అటుగా వచ్చిన ఓ ట్రక్కు ఆ గుంతలో పడిపోయింది. పార్కింగ్ చేసేందుకు ట్రక్కు వస్తుండగా అనుకోని సంఘటనతో ట్రక్కు డ్రైవర్ తో సహా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డాడు..
మహారాష్ట్రలోని పూణెలో ఓ పోస్టాఫీస్ ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో శుక్రవారం (సెప్టెంబర్ 20 ) సాయంత్రం ఆకస్మాత్తుగా భారీ గుంత పడింది. దాదాపు 50 అడుగుల లోతు గుంత పడింది. దీంతో అటుగా వెళ్తున్న సెప్టిక్ ట్యాంక్ ట్రక్కు గుంతలోపడిపోయింది. అప్రమత్తమైన ట్రక్కు డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Maharashtra | A truck fell upside down in the premises of the city post office in the Budwar Peth area of Pune city after a portion of the premises caved in. The truck belongs to the Pune municipal corporation and was there for drainage cleaning work.
— ANI (@ANI) September 20, 2024
20 Jawans of the… pic.twitter.com/YigRhM5iwS
పూణెలోని బుద్వార్ పేత్ ప్రాంతంలో సిటీ పోస్టాఫీసు ఆవరణలో ఈ ఘటన జరిగింది. అనుకుకోకుండా ఏర్పడిన పెద్ద గుంతలో ట్రక్కు తలకిందులుగా పడిపోయింది. ఈ దృశ్యాలు పోస్టాఫీసు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
అయితే ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.. ప్రమాదం పసిగట్టిన డ్రైవర్ వెంటనే వాహనంలోంచి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న ఫైర్ శాఖకు చెందిన 20మంది జవాన్లు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.