అమెరికా స్కూల్​లో కాల్పులు..  ఆరుగురు మృతి

అమెరికా స్కూల్​లో కాల్పులు..  ఆరుగురు మృతి
  •   వుమెన్ షూటర్​ను కాల్చిచంపిన పోలీసులు   

వాషింగ్టన్: అమెరికాలో దారుణం జరిగింది. స్కూల్​లో టీనేజీ అమ్మాయి కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయారు. ఈ ఘటన టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్విల్లేలో జరిగింది. ఇక్కడి క్రిస్టియన్ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్ లో 200 మంది స్టూడెంట్లు చదువుకుంటు న్నారు. 33 మంది స్టాఫ్ ఉన్నారు. సోమ వారం స్కూల్ లోకి చొరబడిన ఓ టీనేజీ అమ్మాయి విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. కాల్పుల్లో ముగ్గురు పిల్లలు, ముగ్గురు టీచర్లు చనిపోయారు. మరి కొంత మంది గాయపడ్డారు. తమ కాల్పుల్లో వుమెన్ షూటర్ చనిపోయింద ని పోలీసులు ప్రకటించారు. ఆమె దగ్గర రెండు రైఫిల్స్ ఉన్నాయని చెప్పారు.  

ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియాలోని గురుద్వారాలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం నిర్వహించిన నాగర్ కీర్తన వేడుకల్లో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. దాంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్​కు చేరుకొని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు. గొడవ కాస్త పెరగడంతో ముగ్గురిలో ఇద్దరు తుపాకీ తీసి ఒకరిపై మరొకరు కాల్పులు జరిపారని వివరించారు. కాల్పులు జరిగిన వెంటనే ఇంకొక వ్యక్తి పరారయ్యాడని చెప్పారు.