రామోజీ ఫిల్మ్ సిటీలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్

ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, మరోవైపు ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. పవన్ కెరీర్‌‌‌‌లోనే ఫస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ప‌‌వ‌‌న్ క‌‌ళ్యాణ్‌‌ కాంబినేషన్‌‌లో హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌‌ తీస్తున్నారు క్రిష్. ఈ క్రమంలో సెట్‌‌ నుండి లీక్‌‌ అయిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బ్రౌన్ కలర్ కాస్ట్యూమ్స్‌‌లో కనిపిస్తున్నారు పవన్. మొఘల్స్ కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బందిపోటు దొంగగా ఆయన నటిస్తున్నారు. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా బాబీ డియోల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. వీలైనంత వేగంగా పవన్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత హరీష్‌‌ శంకర్ డైరెక్షన్‌‌లో పవన్ నటించాల్సి ఉంది. అయితే గ‌‌త కొన్ని నెల‌‌లుగా రాజ‌‌కీయాల‌‌పై ఎక్కువ‌‌గా దృష్టిసారించడంతో ఇది ఆలస్యమైంది. దీంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా మొదలైంది. కానీ త్వరలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ‘భవదీయుడు భగత్‌‌సింగ్‌‌’ టైటిల్‌‌తో రూపొందే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.