అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. స్పాట్‎లోనే నలుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. స్పాట్‎లోనే నలుగురు మృతి

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. బార్‎లోని వారిపై సామూహిక కాల్పులు జరుపడంతో నలుగురు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఆదివారం వేకువజామున దక్షిణ కరోలినా సెయింట్ హెలెనా ద్వీపంలోని విల్లీస్ బార్ అండ్ గ్రిల్‏లో ఈ కాల్పులు జరిగాయి. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‎కు చేరుకున్నారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. 

వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. గాయాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తుపాకీ కాల్పులను తప్పించుకోవడానికి అనేక మంది సమీపంలోని షెల్టర్లకు పరిగెత్తి తలదాచుకున్నారని తెలిపారు. కాల్పులు విషాదకరమైనవని, దీనిపై దర్యాప్తును కొనసాగిస్తున్నామని అందరు ఓపిక పట్టాలని పోలీసులు ఓ ప్రకటన జారీ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.