డ్రెస్ కోడ్ తప్పనిసరి: అక్కడ షార్ట్స్, జీన్స్ నిషేధించారు

డ్రెస్ కోడ్ తప్పనిసరి: అక్కడ షార్ట్స్, జీన్స్ నిషేధించారు

‘అసభ్యకరమైన దుస్తులు ధరించి ఆలయాల్లోకి ప్రవేశించకండి..తప్పని సరిగా డ్రెస్ కోడ్ అమలు చేయాలి..భక్తులు తప్పకుండా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దేవాలయాల్లోకి రావాలి’’.. కర్ణాటకలో ఏ దేవాలయం ముందు చూసినా ఇవే బోర్డులు. భక్తులు తప్పకుండా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దేవాలయాల్లోకి రావాలని కండిషన్స్ తో ప్రతి దేవాలయం ముందుకు బోర్డులు ఏర్పాటు చేశారు ఆలయ నిర్వాహకులు. తప్పని సరిగా డ్రెస్ కోడ్ అమలు చేయాలి అంటున్నారు నిర్వాహకులు. 

షార్ట్, బెర్ముడా, టార్న్ జీన్స్  ఛాతిని చూపించే టీషర్ట్ ధరించి పురుషులు అలయాల్లోకి ప్రవేశించకూడదు. మహిళలు షార్ట్, మిడ్డి, టార్న్ జీన్ ధరించి ఆలయాల్లోకి రాకూడదు. అసభ్యకరమైన దుస్తులు ధరించి ఆలయాల్లోకి ప్రవేశించవద్దని బోర్డుల ద్వారా భక్తులకు విజ్ణప్తి చేస్తున్నారు నిర్వాహకులు. ఆలయ పవిత్రతను కాపాడడం అనేది మతపరమైన బాధ్యత అని చెపుతున్నారు. 

కర్ణాటకలో ని దేవాలయాలు, మఠాలు, మంత సంస్థలసంఘం 2023 డిసెంబర్ లో అన్ని దేవాలయాల అర్చుకులు, ధర్మ కర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి జనవరినుంచి డ్రెస్ కోడ్ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది.