ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఇంటిపై దాడిచేసిన టీఆర్ఎస్​లీడర్లను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక వినాయక్​ చౌక్​లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. లీడర్లు వకులాభరణం వేదవ్యాస్, లాలా మున్న, దినేశ్​ మాటోలియ, ఆకుల ప్రవీణ్, సోమ రవి, మహేందర్, రాజేశ్, ముకుందరావు పాల్గొన్నారు. 

నిర్మల్​లో నిరసన

నిర్మల్,వెలుగు: నిర్మల్​లో సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మ దహనం చేశారు. నిరసనలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్, లీడర్లు వినాయక్​ రెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్​ రెడ్డి, జానకిబాయి, అలివెలు, కమల్​ నయన్, మురళి, సాదం అర్వింద్, రాజేందర్,​ శ్రావణ్ రెడ్డి, విలాస్, శ్రావణ్, భాస్కర్, నరేశ్, రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్​లో..

రామకృష్ణాపూర్/బెల్లంపల్లి,వెలుగు: రామకృష్ణాపూర్​ సూపర్​బజార్​చౌరస్తాలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ మోర్చా టౌన్​ ప్రెసిడెంట్​వీరమల్ల పాలరాజయ్య, బీజేపీ టౌన్​జనరల్ సెక్రటరీ మాసు సత్యనారాయణ, వైస్  ప్రెసిడెంట్ జంగాపెల్లి మల్లయ్య, బీజేవైఎం లీడర్లు సంతోష్​రాం, ఓరుగంటి సాయి, వైద్య శ్రీనివాస్, సతీశ్, రాజు, శివ, మల్లేశ్ పాల్గొన్నారు. 
బెల్లంపల్లిలో బీజేపీ లీడర్లు కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి కె.గోవర్దన్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజులాల్ యాదవ్, దూది ప్రకాశ్, అజ్మీర శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రామన్న యాదవ్, మోహన్, మహేశ్, రాజమల్లు, నవీన్ కుమార్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన చెందవద్దు.. జాగ్రత్తగా ఉండాలె

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లో గురువారం రాత్రి పులి సంచరించిందని.. ప్రజలు ఎవరూ భయపడొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. శుక్రవారం డీఎఫ్ వో దినేశ్​కుమార్, కాగజ్ నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్ తో కలిసి పులిసంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. వంజిరి రైల్వే గేట్ వద్ద పులి అడుగులు గుర్తించే ప్రయత్నం చేశారు. నాలుగు రోజుల క్రితం వాంకిడి మండలం ఖానాపూర్ లో వృద్ధుడిని చంపిన పులి కాగ జ్ నగర్ వైపు వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు. దాని కోసం ప్రత్యేకంగా పది బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఫారెస్ట్​కు దగ్గరగా ఉన్న గ్రామాలు, పంటపొలాలు, పత్తి చేలకు వెళ్లేవారు అలర్ట్​గా ఉండాలన్నారు. గుంపులు గుంపుగా వెళ్తూ శబ్దాలు చేయాలన్నారు. పులి కనిపిస్తే ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. పులి దాడిలో మృతి చెందిన ఖానాపూర్ కు చెందిన సిదమ్ భీము కు రూ. 15 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదివాసీ భారత్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పెందో ర్ రాజేశ్, సీపీ ఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి ఈ సందర్భంగా డీఎఫ్​వోకు వినతి పత్రం అందజేశారు.

ముదిరాజ్​ల అభివృద్ధికి  కృషి చేయాలి

ఆసిఫాబాద్,వెలుగు: ముదిరాజ్ ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సేర్ల మురళీధర్ కోరారు. శుక్రవారం ఆయన స్థానికంగా మాట్లాడారు. సంఘ భవనం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలన్నారు. ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ముదిరాజ్​లను బీసీ(డి) నుంచి బీసీ(ఎ )లో చేర్చాలన్నారు. ముదిరాజ్ కుల సంఘాలకు ప్రత్యేక అభివృద్ధి కోసం రూ. మూడు వేల కోట్లు రిలీజ్​చేయాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం మండల అధ్యక్షుడు పులి సతీశ్, ప్రధాన కార్యదర్శి నెల్లి రవి, ఉపాధ్యక్షులు బొండ్ల రాజేశ్, యాటకర్ల రవి, బాసవేణి వెంకటేశ్, నెల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

డీటీసీపీ పర్మిషన్​ తప్పనిసరి

నిర్మల్,వెలుగు: లేఔట్స్ కోసం డీటీసీపీ పర్మిషన్​తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారూఖీ రియల్టర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లాలోని రియల్​ఎస్టేట్​వ్యాపారులతో మీటింగ్ నిర్వహించారు. డీటీసీపీ పర్మిషన్ కోసం ఆన్​లైన్​ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇదివరకే అమ్మిన ప్లాట్లకు నిబంధనల మేరకు రీడిజైన్ చేస్తామన్నారు. గవర్నమెంట్, నిషేధిత భూముల్లో లేఔట్లు చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​హేమంత్​బోర్కడే, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: పోలీసులు పోక్సో కేసుల్లో బాధితులకు న్యాయం చేసేలా చూడాలని జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి డి.మాధవి కృష్ణ కోరారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్​క్వార్టర్స్ లో ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సమక్షంలో జిల్లా న్యాయ సేవాధికారి క్షమా దేశ్​పాండే, పీపీలు, పోలీసు ఆఫీసర్లు పోక్సో కేసులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు క్రైమ్​రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, పీపీలు ముస్కు రమణారెడ్డి, మేకల మధూకర్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు స్పీడప్​ చేయండి

లక్ష్మణచాంద( మామడ), వెలుగు: కొత్త ఓటర్ల నమోదు స్పీడప్​చేయాలని బీజేపీ మండల ఇన్​చార్జి కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి కోరారు. శుక్రవారం మామడ మండలంలో కార్యకర్తలతో కలిసి ఓటరు నమోదుపై చర్చించారు. శక్తి కేంద్రాల ఇన్​చార్జిలకు లిస్టులను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మామడ మండల అధ్యక్షుడు కొరిపల్లి లింగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగన్న, నరేశ్​ పాల్గొన్నారు.

నిర్మల్​లో పట్టపగలే దొంగతనం

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని కావేరినగర్​లో శుక్రవారం పట్టపగలు ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలోని 10 తులాల బంగారం, 50 తులాల వెండి ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. 

‘స్పెల్​ బీ’ విజేతలకు బహుమతులు అందజేత 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్​1989–-1990 పూర్వ విద్యార్థులు హెబ్రోన్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీ జార్జ్ మెమోరియల్ ఇంటర్ స్కూల్ స్పెల్ బీ కాంపిటీషన్​ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఓవరాల్​ చాంపియన్​షిప్ పొందిన జగిత్యాల మౌంట్ కార్మెల్ స్కూల్​ విద్యార్థులకు రూ.6వేల క్యాష్​ ప్రైజ్​, ట్రోఫీ అందించారు.  

రేపు కార్తీక వనభోజన మహోత్సవం 

మంచిర్యాల, వెలుగు: కమ్మ సేవా సమితి మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 20న ఎంసీసీ క్వారీలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రామాంజనేయులు, ఎం.జగదీశ్​, మంచిర్యాల 24వ వార్డు కౌన్సిలర్​ వేములపల్లి సంజీవ్​ తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రవచనకారులు రావిపాటి వేంకటప్రసాద్​, ఆత్మీయ అతిథిగా సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట కాకతీయ సేవాసమితి కోశాధికారి కొర్రపాటి అయోధ్యరామారావు హాజరవుతారని పేర్కొన్నారు. కమ్మ బాంధవులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

పెండింగ్​ డీఏను విడుదల చేయాలి 

మంచిర్యాల, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్​ ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని టీఎస్​యూటీఎఫ్​ రాష్ర్ట కార్యదర్శి వైద్య శాంతికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవేణు డిమాండ్​ చేశారు. శుక్రవారం మంచిర్యాలలోని పలు స్కూళ్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో టీఎస్​ యూటీఎఫ్​ ముందు వరుసలో ఉందన్నారు. కేజీబీవీలు, ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో పనిచేస్తున్న సీఆర్టీలను, గెస్ట్, పార్ట్ టైమ్​, ఔట్​సోర్సింగ్​ టీచర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సీపీఎస్​ను రద్దు చేసి పాత పెన్షన్​ విధాన్ని పునరుద్ధరించాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు.  

ఎంపీ ఇంటిపై దాడి చేయడం సరికాదు

భైంసా,వెలుగు: నిజామాబాద్​ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఇంటిపై టీఆర్ఎస్ లీడర్ల దాడి హేయమైన చర్య అని కిరణ్ ఫౌండేషన్​చైర్మన్​డాక్టర్​ కిరణ్ ​పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. దాడిని తాము త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ కుటుంబానికి కుల అహంకారం పెరిగిందన్నారు. ఎంపీ తల్లి, మహిళా స్టాఫ్​పై దాడి చేయడం దారుణమన్నారు. ఇలాంటి దాడులు జరుగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ అర్వింద్​కు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

కిసాన్​ మోర్చా అధ్యక్షుల నియామకం 

మంచిర్యాల, వెలుగు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆధ్వర్యంలో కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకటరమణారావు శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాలకు అధ్యక్షులను నియమించారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు పెద్దపల్లి పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షుడు రజినీష్ జైన్ పాల్గొన్నారు. 

రోడ్డు పనులు తొందరగా కంప్లీట్​ చేయాలి

కాగజ్ నగర్,వెలుగు: కాగజ్ నగర్ నుంచి పట్టణంలోని ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్ వరకు చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణం పనులు తొందరగా కంప్లీట్​చేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశించారు. శుక్రవారం క్రాస్ రోడ్డు నుంచి పెద్దవాగు వరకు ప్రారంభమైన డబుల్ రోడ్డు పనులు ఆయన పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్అండ్ బీ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ రవి కిరణ్  తదితరులు ఉన్నారు.

సకల జనుల కోసం కేసీఆర్​ కృషి

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: రాష్ట్రంలో సకల జనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్​కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. శుక్రవారం టీఆర్ఎస్​కేవీ అనుబంధ సెకండ్​ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర రెండో మహాసభ పోస్టర్ ను ఆయన రిలీజ్​చేశారు. ఈ నెల20న హైదరాబాద్ లో మహాసభ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్​భోజారెడ్డి, వైద్య ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, లీడర్లు అనసూయ, స్వామి, అశోక్, మమత. జ్యోతి, లక్ష్మి,రేణుక తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటీకరణ లేదంటూనే బొగ్గు బ్లాకులకు వేలం

మందమర్రి,వెలుగు: సింగరేణిని ప్రైవేటుపరం చేయమంటూనే బొగ్గు బ్లాక్​లను ఎందుకు వేలం వేస్తున్నారని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట2 గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కేంద్రం బొగ్గు బ్లాక్​లను ప్రైవేటుపరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల్లో కాంట్రాక్టీకరణ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. 11వ వేజ్​బోర్డు ఒప్పందం అమలులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. ఈనెల 30న జరిగే మీటింగ్​లో కార్మికులకు మెరుగైన వేతనాల కోసం పట్టుపడుతామన్నారు. ఈ సందర్భంగా కార్మికులు పలువురు ఏఐటీయూసీలో చేరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్​అలీ, బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, సీనియర్ లీటర్ చిప్ప నర్సయ్య, బియ్యాల వెంకటస్వామి, గొల్ల శ్రీనివాస్,​ పులి శంకర్, కొత్తపెల్లి నర్సయ్య, బొద్దుల వెంకటేశ్, తీర్థాల చంద్రయ్య, రాజకొమురయ్య, గోదారుల లింగమూర్తి, కుమార్​బాబు తదితరులు పాల్గొన్నారు. 

గెలుపు పొందువరకు...

కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు సాధించేందుకు యువతీయువకులు కఠోర సాధన చేస్తున్నారు. ప్రిలిమినరీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు పోలీసుశాఖవారు నిర్వహించే ఈవెంట్స్ లో రాణించేందుకు మైదానాల్లో చెమటోడుస్తున్నారు. మరికొందరు ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనర్ సహాయం తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఆదిలాబాద్​లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రాక్టీస్​ చేస్తుండగా తీసిన ఫొటోలే ఇవి.

- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

సమస్యలు పరిష్కరించండి

భైంసా, వెలుగు: భైంసా మున్సిపాల్టీ పరిధిలోని చాలా వార్డుల్లో సమస్యలు వేధిస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీజేఎస్​ సెగ్మెంట్​ ఇన్​చార్జి సర్దార్​వినోద్ ​కుమార్​ కోరారు. శుక్రవారం వైస్​ చైర్మన్​ జాబీర్ అహ్మద్ కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో లీడర్లు విలాస్, సతీశ్, మనీశ్, విశాల్, సంతోష్, పోతన్న , మహేశ్​ యాదవ్, వికాస్​ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలె

జన్నారం,వెలుగు: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కోరారు. శుక్రవారం మండలంలోని పొన్కల్​, రేండ్లగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ మారుతుందని అనుచిత వాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్​కు వచ్చే ఎన్నికల్లో మహిళలు గుణపాఠం చెబుతారన్నారు. టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, పొన్కల్​సహకార సంఘం చైర్మన్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.