కామారెడ్డి, వెలుగు: ప్లానింగ్ ప్రకారం చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. సదాశివనగర్ మండలం మర్కల్ సమీపంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు ఇష్టపడి చదవాలన్నారు. పోటీ పరీక్షలకు కావాల్సిన బుక్స్ స్టూడెంట్లకు అందించారు. ప్రిన్సిపాల్ రాధిక, వైస్‌ప్రిన్సిపాల్ వనజ పాల్గొన్నారు.
రూర్బన్ పనులు త్వరగా కంప్లీట్ చేయాలి
జుక్కల్‌లో చేపట్టిన రూర్బన్ పనులు త్వరగా కంప్లీట్ చేయాలని సంబంధిత ఆఫీసర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం రూర్బన్ పనులపై జరిగిన రివ్యూలో ఆయన మాట్లాడారు. హర్టికల్చర్‌కు సంబంధించిన పనులు ఈ నెల 30లోగా కంప్లీట్ కావాలన్నారు. మిగతా పనులు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్దొత్రే, డీఆర్‌డీవో సాయన్న, జిల్లా హర్టికల్చర్ ఆఫీసర్ సంజీవరావు పాల్గొన్నారు.
అసత్య ప్రచారాలు మానుకోవాలి
సిరికొండ/నవీపేట్, వెలుగు: ఎమ్మెల్సీ కవితపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీజేపీ లీడర్ల తీరుపై జాగృతి, టీఆర్‌ఎస్ లీడర్లు బుధవారం నిరసన తెలిపారు. ఈ మేరకు మండలంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం పీఎం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జాగృతి రూరల్ కన్వీనర్ సాయిచరణ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, సర్పంచ్ రాజరెడ్డి, సంతోష్‌రెడ్డి, కిషన్, అన్సార్, ఆదిత్య పాల్గొన్నారు. నవీపేట్‌లో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
దివ్యాంగులకు ప్రత్యేక నిర్ధారణ శిబిరం
బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసులో దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ మంజురు కోసం ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్డీవో రాజేశ్వర్ ప్రారంభించి మాట్లాడారు. 80 శాతం పైబడిన దివ్యాంగులకు ట్రై సైకిల్మంజురు చేయడానికి ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హతను బట్టి ట్రై సైకిళ్లను మంజురు చేయడం చేస్తామన్నారు. క్యాంపులో బోధన్, సాలూర, ఎడపల్లి, రెజంల్ మండలాలకు చెందిన 154 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మావతి, కమిషనర్ రామలింగం, ఎంపీడీవో మధుకర్, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ఇందిరా, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు రాధిక, ప్రమీల, మమత, అలింకో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
వర్ని, వెలుగు: మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు బాగుపడతాయన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో రూ.35 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ఆదర్శ మహిళా మండలి భవనానికి బుధవారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో రూ.50 లక్షలతో మహిళా మండలి భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి,ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, జడ్పీటీసీ హరిదాసు, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి
వర్ని, వెలుగు: ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రుద్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రుద్రూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కమిటీ జిల్లా ప్రెసిడెంట్ సయ్యద్ ముల్తాని మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న రాజాసింగ్ హిందూ, ముస్లింల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
రాజీవ్‌నగర్ సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు
బోధన్, వెలుగు: రాజీవ్‌నగర్ సర్పంచ్ రంజానాయక్‌కు కలెక్టర్ నారాయణరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గ్రామంలోని నివాసగృహాలపై నుంచి ప్రమాదకరంగా 11 కేవీ వైర్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినా సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యహరించడంతో షోకాజ్నోటీసును జారీ చేశారు. వారం రోజుల్లో నోటిసుకు వివరణ ఇవ్వాలన్నారు.
